శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాలా విesi కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాలా విesi కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ
గురువుగారి పాదం మొక్కి
మండల కాలం దీక్షను బూని
స్వామి పూజలు చేసి
తల్లి తండ్రికి దండం పెట్టి
ఇరుముడి మూట నెట్టిన పెట్టి
అడవి దారిన పయనించి
స్వామి పల్లికట్టు శబరిమలక్కు
శరణుఘోష పాడుకొంటూ
సాగిపోదాం కన్నె స్వామీ.. సామీ
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాలా విesi కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ
రాళ్లు ముల్లు యెన్నో ఉన్నా
కొండా కోన దాటుకుంటూ
అలుడ తీరం చేరి
రాళ్లను రెండు సేకరించి
గుట్టపైన భక్తితో ఉండి
కరిమల శిఖరం చేరి
స్వామి కళ్ళు ముల్లుం కాలికి మెత్తె
శరణుఘోష పాడుకొంటూ
పంపకు పోదాం కన్నె స్వామి.. సామీ
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాలా విesi కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ
పంబ నదిలో స్నానం చేసి
పంబ గణపతి పాదం మొక్కి
నీలిమలగిరి శిఖరంపై
శబరి మాటకు దండం పెట్టి
సారముల గుత్తిలో బాణం గుచ్చి
పదునీతంబడి దారి చేరి
స్వామి మెట్టు పైనా మెట్టు నెక్కి
మొదటి మెట్టుకు దండం పెట్టి
పజ్జెంమిడి మెట్లనెక్కు కన్నె స్వామి.. సామీ
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాల వేసి కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాల వేసి కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ