ఇంతందం
దారి మళ్ళిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే
చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా
జగత్తు చూడనీ
మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి
తరించె తపస్సీలా
నిశీదులన్నీ తలొంచే తుషారాణివా
విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే
నీదే వేలు తాకి, నేలే ఇంచు పైకి, తేలే వింత వైఖరీ
వీడే వీలు లేని, ఏదో మాయలోకి, లాగే పిల్ల తెంపరీ
నదిలా దూకేటి నీ పైట సహజగుణం
పులిలా దాగుంది వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే
విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే
చిలకే కోక కట్టి, నిన్నే చుట్టుముట్టి, సీతాకోకలాయేనా
విల్లే ఎక్కు పెట్టి, మెల్లో తాళి కట్టి, మరలా రాముడవ్వనా
అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే
విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే