పల్లవి :-
మనసిచ్చిన అమ్మాయినే మనవాడలేనప్పుడు…
ప్రేమించిన అమ్మాయితోని జీవించలేనప్పుడు
నా ప్రాణాలు ఎందుకమ్మా ……నీ పక్కన నేనే లేనప్పుడు
నేను బతికుండుదెందుకమ్మా….నా బతుకంత నీతోని కానప్పుడు
ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నాబాధకి —2
చరణం :-
నువ్వు తలమీద ఒట్టేసి చెప్పిన మాటలు
జిలకర బెల్లమమ్మా ….
నువ్వు నాతోని వేసిన అడుగులన్నీ
ఏడు అడుగులే బంగారమా
నువ్వు ప్రేమతో పెట్టిన ముద్దులన్ని
మోసమేనా నా ప్రాణమా
( నీకు ఇన్నాళ్ల మనప్రేమ జ్ఞాపకాలన్నీ గుర్తన్న లేవబొమ్మా )
నిన్ను ప్రాణంగా ప్రేమించితే….. thank You Da
నా ప్రాణాలతో ఆడుకున్నావుగా
పిచ్చిగా నిన్ను ప్రేమించితే
నన్ను పిచ్చొన్ని చెసే పోయావుగా
గుండెలోతుల్లో సచ్చేంత బాదున్నది కానీ అందరికి చెప్పుకోలేనుగా
~( నా పిల్లనే నన్ను వద్దన్నది అంటూ అందరికి చెప్పుకోలేనుగా )
ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నాబాధకి — 2
చరణం :-
కన్న తల్లి సచ్చిపోతున్న గానీ
కన్నీళ్లు రానప్పుడూ
ప్రేమించినమ్మాయి వదిలేసి పోతే
సచ్చేంత బాదేందుకు
నువ్వు ఏ బాద లేకుండ ఇంకొనితోని
నవ్వుతు ఉన్నప్పుడూ….
నేను నీకోసం ఏడుస్తు కన్నీళ్లు కారుస్తూ
చస్తున్ననే ఎందుకు….
నా ప్రాణాన్ని అడిగివుంటే …..
నవ్వుతూ నీకోసం ఇచ్ఛేటోన్నే
ప్రేమలేదంటు సీజెప్పివుంటే
నీ నీడకైనా దూరం ఉండేటోన్నే
ఓ అందాల పెళ్లి పందిరిలో బంగారు బొమ్మ నువ్వేనే
నీ పెళ్ళికి రావాలి
అక్షింతలు వెయ్యాలి
పెళ్లి డప్పులు మోగాలి
నీ పెళ్ళికి మోగిన డప్పులతో నా సావును చెయ్యాలీ……..
ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నాబాధకి