ఓ నిండు భూమి
నిను రెండు చేతులతో
కౌగిలించమని పిలిచినదా…
పిలుపు వినరా
మలుపు కనరా…
పరుగువై పదపదరా…
గుండె దాటుకుని
పండుగైన కల పపిడి దారులను
తెరిచినదా…
రుణము తీర్చే
తరుణమిదిరా
కిరణమై పదపదరా…
ఓ ఏమి వదిలి
ఎటు కదులుతోందొ
మది మాటకైన మరి తలచినదా…
మనిషి తనమే
నిజము ధనమై పరులకై పద పదరా…
మరలి మరల
వెనుదిరగనన్న చిరునవ్వే
నీకు తొలి గెలుపు కదా…
మనసు వెతికే
మార్గమిది రా .. మంచికై పద పద రా
లోకం చీకట్లు చీల్చే ధ్యేయం
నీ ఇంధనం…
ప్రేమై వర్షించనీ… నీ ప్రాణం…
సాయం సమాజమే
నీ గేయం నిరంతరం…
కోరే ప్రపంచ సౌఖ్యం నీకు గాక ఎవరికి సాధ్యం…
విశ్వమంతటికి పేరుపేరునా
ప్రేమ పంచగల పసితనమా…
ఎదురు చూసే ఎదను మీటే
పావనమై పదపదరా
లేనిదేదొ పని లేనిదేదొ
విడమరిచి చూడగల
రుషి గుణమా…
చిగురు మురిసే
చినుకు తడిగా
పయనమై పదపదరా…
పోరా శ్రీమంతుడా… పోపోరాశ్రీమంతుడా…
నీలో లక్ష్యానికి జయహో…
పోరా శ్రీమంతుడా… పో పోరా శ్రీమంతుడా…
నీలో స్వప్నాలు అన్ని , సాకారం అవగా
జయహో జయహో