శ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం
ఇందిరా విష్ణుహృదయమందిరా పద్మసుందరా |
నందితాఽఖిలభక్తశ్రీర్నందికేశ్వరవందితా || 1 ||
కేశవప్రియచారిత్రా కేవలానందరూపిణీ |
కేయూరహారమంజీరా కేతకీపుష్పధారణీ || 2 ||
కారుణ్యకవితాపాంగీ కామితార్థప్రదాయనీ |
కామధుక్సదృశా శక్తిః కాలకర్మవిధాయినీ || 3 ||
జితదారిద్ర్యసందోహా ధృతపంకేరుహద్వయీ |
కృతవిద్ధ్యండసంరక్షా నతాపత్పరిహారిణీ || 4 ||
నీలాభ్రాంగసరోనేత్రా నీలోత్పలసుచంద్రికా |
నీలకంఠముఖారాధ్యా నీలాంబరముఖస్తుతా || 5 ||
సర్వవేదాంతసందోహశుక్తిముక్తాఫలాయితా |
సముద్రతనయా సర్వసురకాంతోపసేవితా || 6 ||
భార్గవీ భానుమత్యాదిభావితా భార్గవాత్మజా |
భాస్వత్కనకతాటంకా భానుకోట్యధికప్రభా || 7 ||
పద్మసద్మపవిత్రాంగీ పద్మాస్యా చ పరాత్పరా |
పద్మనాభప్రియసతీ పద్మభూస్తన్యదాయినీ || 8 ||
భక్తదారిద్ర్యశమనీ ముక్తిసాధకదాయినీ |
భుక్తిభోగ్యప్రదా భవ్యశక్తిమదీశ్వరీ || 9 ||
జన్మమృత్యుజ్వరత్రస్తజనజీవాతులోచనా |
జగన్మాతా జయకరీ జయశీలా సుఖప్రదా || 10 ||
చారుసౌభాగ్యసద్విద్యా చామరద్వయశోభితా |
చామీకరప్రభా సర్వచాతుర్యఫలరూపిణీ || 11 ||
రాజీవనయనారమ్యా రామణీయకజన్మభూః |
రాజరాజార్చితపదా రాజముద్రాస్వరూపిణీ || 12 ||
తారుణ్యవనసారంగీ తాపసార్చితపాదుకా |
తాత్త్వికీ తారకేశార్కతాటంకద్వయమండితా || 13 ||
భవ్యవిశ్రాణనోద్యుక్తా సవ్యక్తసుఖవిగ్రహా |
దివ్యవైభవసంపూర్ణా నవ్యభక్తిశుభోదయా || 14 ||
తరుణాదిత్యతామ్రశ్రీః కరుణారసవాహినీ |
శరణాగతసంత్రాణచరణా కరుణేక్షణా || 15 ||
విత్తదారిద్ర్యశమనీ విత్తక్లేశనివారిణీ |
మత్తహంసగతిః సర్వసత్తాసామాన్యరూపిణీ || 16 ||
వాల్మీకివ్యాసదుర్వాసోవాలఖిల్యాదివాంఛితా |
వారిజేక్షణహృత్కేకివారిదాయితవిగ్రహా || 17 ||
దృష్ట్యాఽఽసాదితవిద్ధ్యండా సృష్ట్యాదిమహిమోచ్ఛ్రయా |
ఆస్తిక్యపుష్పభృంగీ చ నాస్తికోన్మూలనక్షమా || 18 ||
కృతసద్భక్తిసంతోషా కృత్తదుర్జనపౌరుషా |
సంజీవితాశేషభాషా సర్వాకర్షమతిస్నుషా || 19 ||
నిత్యశుద్ధా పరా బుద్ధా సత్యా సంవిదనామయా |
విజయా విష్ణురమణీ విమలా విజయప్రదా || 20 ||
శ్రీంకారకామదోగ్ధ్రీ చ హ్రీంకారతరుకోకిలా |
ఐంకారపద్మలోలంబా క్లీంకారామృతనిమ్నగా || 21 ||
తపనీయాభసుతనుః కమనీయస్మితాననా |
గణనీయగుణగ్రామా శయనీయోరగేశ్వరా || 22 ||
రమణీయసువేషాఢ్యా కరణీయక్రియేశ్వరీ |
స్మరణీయచరిత్రా చ తరుణీ యజ్ఞరూపిణీ || 23 ||
శ్రీవృక్షవాసినీ యోగిధీవృత్తిపరిభావితా |
ప్రావృడ్భార్గవవారార్చ్యా సంవృతామరభామినీ || 24 ||
తనుమధ్యా భగవతీ మనుజాపివరప్రదా |
లక్ష్మీ బిల్వాశ్రితా పాతు సోఽష్టోత్తరశతస్తుతా || 25 ||
ఇతి ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
[download id=”399290″]