Search

Maha Adhbutham in Telugu

Facebook
Pinterest
Threads
X
WhatsApp

మహా.. అద్భుతం.. కదా..
అదే.. జీవితం.. కదా..

చినుకు చిగురు కలువ కొలను అన్ని నువ్వేలే
అలలు శిలలు కళలు తెరలు
ఏవైనా నువ్వేలే


ప్రశ్న బదులు హాయి దిగులు అన్ని నీలోనే
నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే
అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే
ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే
ప్రతి రోజు రాదా వసంతం

ఆనందాల చడి చప్పుడు
నీలో నాలో ఉంటాయెప్పుడు
గుర్తే పట్టక గుక్కె పెడితే లాభం లేదే
నీకే ఉంటె చూసే కన్నులు
చుట్టూ లేవా ఎన్నో రంగులు
రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే

ఓహ్ కాలమే నేస్తమై నయం చేస్తుందే
గాయాల గతాన్నే ఓహో…
ఓహో అందుకే ఈ క్షణం
ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం
పోదాం భయం దేనికి
పడుతూ లేచే అలలే కాదా నీకే ఆదర్షం
ఉరుమొ మెరుపొ ఎదురే పడని
పరుగాపకు నీ పయనం

తీపి కావాలంటే చేదు మింగాలంతే
కష్టమొచ్చి కౌగిలిస్తే
హత్తుకో ఎంతో ఇష్టంగా

కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగ

కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపాని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగ

(కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపాని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగ)

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!