రైట్ నౌ మొదలైంది మా కథ
పలు రంగుల వాన విల్లుగా
విడి విడి వర్ణాల మనసులె ఏకం కాగా
రైట్ నౌ మొదలైంది మా కథ
పలు గొంతుల తేనె జల్లుగా
సరిగమ పదనిస్వరాలుగా
వినిపించెను స్నేహ గీతిక
ఒక్కోలాంటి భావాలూ ఓ చోటిలా
ఎలా వచ్చి వాలాయో పూదండలా
తెలీదే మరి తలో మాదిరి
అయినా స్నేహమే ఊపిరి
కేరింత కలగలిసిన మనసుల బావుటా
కేరింత ఒకరికి మరి ఒకరను బాసట
పొద్దు వాలిపోని సరదా తప్పదు తప్పదు
లేనే లేడు మాకే నింగి సూర్యుడు చంద్రుడు
ఓ యా ఓ… ఓ …
స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు
గుర్తు రానే రాదె గుండె చప్పుడు చప్పుడు
ఓ యా ఓ… ఓ …
చిరునవ్వై… విరబూసే… ఆనందం… ఎంతైనా చాలదు
కేరింత కలగలిసిన మనసుల బావుటా
కేరింత ఒకరికి మరి ఒకరను బాసట
కదిలే కాలం ఒకటే చోట ఆగదు ఆగదు
తనతో పయనం ఒకటేలాగా ఉండదు ఉండదు
ఓ యా ఓ… ఓ …
ఏ నిమిషంలో ఎమౌంతుందో ఉహకే అందదు
ఏ అనుబందం ఎటు వెళుతుందో ముందుగా చెప్పదు
ఓ యా ఓ… ఓ …
చెలిమైనా… ప్రేమైనా… ఏ మనసు… ఒంటరిగా సాగదు
కేరింత కేరింత కేరింత