ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో || emo aunemo nijamemo nalo maimrape ruzuvemo lyrics

Pinterest
X
WhatsApp

ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో
ఏంచేసిందో ఆ చిన్నదీ ప్రేమించేసానందీమది
తన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి

ఒక్కటే ఙాపకం ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంట పడకుంటే తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి

ఆమెనే వెతకటం అందుకే బ్రతకటం కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటి చూపులో మౌనం చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా కలవరమా ఆమెతో ఈ అలజడి

Leave your vote

0 Points
Upvote

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!