Search

Bheemla nayak title song lyrics in Telugu

Facebook
Pinterest
Threads
X
WhatsApp

ఆడగాదు ఈడగాదు, ఆమిరోళ్ల మేడగదు
గుర్రంనీళ్ల గుట్టకాడ అలుగు వాగు తాండ లోనా
బెమ్మ జెముడు చెట్టున్నాది

బెమ్మ జెముడు చెట్టుకింద, అమ్మ నెప్పులు పడుతున్నది
ఏండలేదు రాతిరిగాదు ఎగుసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులి పిల్ల
పుట్టిండాడు పులి పిల్ల నల్లమల్ల తాలూకాల

అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు
నాయన పేరు సోమలగండు, తాత పేరు బహదూరు
ముద్దుల తాత వీరా నాయక్, పెట్టిన పేరు భీమ్లా నాయక్
శహబాస్ భీమ్లా నాయకా

భీమ్లా నాయక్, భీమ్లా నాయక్
ఇరగదీసే ఈడీ ఫైర్ సల్లగుండా
కాకీడ్రెస్ పక్కనెడితే వీడే పెద్దగుండా
నిమ్మళంగా కనపడే నిప్పుకొండ
ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండ
ఇస్తిరి నలగని చొక్కా, పొగరుగా తిరిగే తిక్క
ఛమాడలువలిచే లెక్క, కొట్టాడంటే పక్క ఇరుగును బొక్క

భీం భీం భీం భీం భీమ్లా నాయక్
బుర్ర రాంకీర్తనా పాడించే లాఠి గాయక్
భీం భీం భీం భీం భీమ్లా నాయక్
దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్

ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే
ఆ షర్టు నట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినటే

భీమ్లా నాయక్, భీమ్లా నాయక్

ఎవ్వడైనా వీడిముందు గడ్డిపోసా, ఎర్రిగంతులేస్తే ఇరిగిపోద్ది వెన్నుపూస
కుమ్మడంలో వీడే ఒక బ్రాండ్ తెలుసా వీడి దెబ్బ తిన్న ప్రతివాడు పాస్ట్ టెంసా
నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు టెంపర్మెంటే హాటు పవర్ కు ఎత్తిన గేటు ఆ నేము ప్లేటు

భీం భీం భీం భీం భీమ్లా నాయక్
బుర్ర రాంకీర్తనా పాడించే లాఠి గాయక్
భీం భీం భీం భీం భీమ్లా నాయక్
దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్

గుంటూరు కారం ఆ యూనిఫారం, మంటెత్తిపోద్ది నకరాలుచేస్తే
లావా దుమారం లాఠీ విహారం పెట్రేగిపోది నేరాలు చుస్తే
సెలవంటూ అనడు శనిఆదివారం అల్ రౌండ్ క్లాకు పిస్తోలు దోస్తే

భీమ్లా నాయక్, భీమ్లా నాయక్

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!