శబరిమలేస శంభుకుమార అయ్యప్ప నీకు
నియమాలే నివేదనయ్యా మణికంఠ
మా శరణాలు గైకొనవయ్యా అయ్యప్పా.. సామీ
శబరిమలేస శంభుకుమార అయ్యప్ప నీకు
నియమాలే నివేదనయ్యా మణికంఠ
మా శరణాలు గైకొనవయ్యా అయ్యప్ప
పల్లికట్టు.. శబరిమలక్కు
కల్లుం ముల్లుం.. కాలికి మెత్తె
స్వామియే.. అయ్యప్పో
స్వామి శరణం.. అయ్యప్ప శరణం
పుట్టుక పంబ తీరం
పెరిగింది పండాల రాజ్యం
పుట్టుక పంబ తీరం
పెరిగింది పండాల రాజ్యం
మెడలో మణిమయ హారం
మణికంఠుడు నీ శుభ నామం
మెడలో మణిమయ హారం
మణికంఠుడు నీ శుభ నామం
మదనపట్టిన మహిషిణి చంపి మణికంఠ..
మాచారములు తుంచేసావు అయ్యప్పా
మాలో సమేతాలు నింపేసావు అయ్యప్పా.. సామీ
శబరిమలేస శంభుకుమార అయ్యప్ప నీకు
నియమాలే నివేదనయ్యా మణికంఠ
మా శరణాలు గైకొనవయ్యా అయ్యప్ప
చల్లని నీతితో స్నానం
నీ పూజా భజనల సేవనం
చల్లని నీతితో స్నానం
నీ పూజా భజనల సేవనం
నల్లని దీక్షా వస్త్రం
మరి మనసున నీ శుభ నామం
నల్లని దీక్షా వస్త్రం
మరి మనసున నీ శుభ నామం
మండల కాలం దీక్షను చేసి మణికంఠ..
ఇరుముడితో వచ్చేమయ్య అయ్యప్పా
నీ కొండలెక్కి వస్తామయ్య అయ్యప్పా.. సామీ
శబరిమలేస శంభుకుమార అయ్యప్ప నీకు
నియమాలే నివేదనయ్యా మణికంఠ
మా శరణాలు గైకొనవయ్యా అయ్యప్ప
పంబ నదిలో స్నానం
ఇక కడిగేయును మన పాపం
పంబ నదిలో స్నానం
ఇక కడిగేయును మన పాపం
దివ్యమైన పజ్జెంమిడి మెట్లపై
పొందేము నీ ధర్శనం
దివ్యమైన పజ్జెంమిడి మెట్లపై
పొందేము నీ ధర్శనం
మకర సంక్రాంతి సాయంత్రాన మణికంఠ..
జ్యోతిలాగా కనపడతావు అయ్యప్పా
మాలో జ్ఞాన జ్యోతి వెలిగించయ్యా అయ్యప్పా.. సామీ
శబరిమలేస శంభుకుమార అయ్యప్ప నీకు
నియమాలే నివేదనయ్యా మణికంఠ
మా శరణాలు గైకొనవయ్యా అయ్యప్ప
పల్లికట్టు.. శబరిమలక్కు
కల్లుం ముల్లుం.. కాలికి మెత్తె
స్వామియే.. అయ్యప్పో
స్వామి శరణం.. అయ్యప్ప శరణం
స్వామియే.. అయ్యప్పో
స్వామి శరణం.. అయ్యప్ప శరణం
శరణుఘోష ప్రియనే… శరణమయ్యప్ప