కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే
తాకుతున్న చోట సోకు నిప్పు రెగుతుంటే
రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే
మంట చుట్టు ముట్టి కన్నె కొంపలంటుకుంటే ..
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతోంది
పెదల్లో నవ్వో కెవ్వో పువ్వాయి పూస్తుంది
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే
తాకుతున్న చోట సోకు నిప్పు రెగుతుంటే
రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే
మంట చుట్టు ముట్టి కన్నె కొంపలంటుకుంటే..
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతోంది
పెదల్లో నవ్వో కెవ్వో పువ్వాయి పూస్తుంది
అమ్మడు నీ యవ్వరం అసలుకే యాసరు పెడుతుంటే
కమ్మగా నీ సింగారం కసురు ముసురుతుంటే
పిల్లడు నా పలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే
మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే
చిన్ననాడే అన్నప్రసనయ్యిందోయ్ కన్నెదని వన్నె ప్రసన్నవ్వలోయ్
అమ్మ చేతి గోరుముద్ద తిన్ననోయ్ అందగాడి గోటి ముద్ర కావాలొయ్
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే
కోరుకున్న చోట నువ్వు నేను చేరుకుంటే
చేరుకున్న చోట ఉన్న దీపం అరుతుంటే
ఆరుతున్నవేళ కన్నెకాలు జారుతుంటే…
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతోంది
పెదల్లో నవ్వో కెవ్వో పువ్వాయి పూస్తుంది
మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే
గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే
కొత్తగా నీ శృంగారం సోగసులో గిలకలవుతుంటే
పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే
బుగ్గలోన పండుతుంది జంపండు పక్కలోన రాలుతుంది ప్రేంపండు
రతీరెలా వచ్చిపోర రాంపండు బంతులాడి పుచ్చుకోర భాంపండు
కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే
ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే
చూపనంటూ నేను తీపి ఆశ రేపుతుంటే
రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడేంటంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతోంది
పెదల్లో నవ్వో కెవ్వో పువ్వాయి పూస్తుంది
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతోంది
పెదల్లో నవ్వో కెవ్వో పువ్వాయి పూస్తుంది