Sri Vidyaranya Ashtottara Shatanama Stotram – శ్రీ విద్యారణ్యాష్టోత్తరశతనామ స్తోత్రమ్ – Telugu Lyrics
శ్రీ విద్యారణ్యాష్టోత్తరశతనామ స్తోత్రమ్ విద్యారణ్యమహాయోగీ మహావిద్యాప్రకాశకః | శ్రీవిద్యానగరోద్ధర్తా విద్యారత్నమహోదధిః || 1 || రామాయణమహాసప్తకోటిమంత్రప్రకాశకః | శ్రీదేవీకరుణాపూర్ణః పరిపూర్ణమనోరథః || 2 || విరూపాక్షమహాక్షేత్రస్వర్ణవృష్టిప్రకల్పకః | వేదత్రయోల్లసద్భాష్యకర్తా తత్త్వార్థకోవిదః || 3 || భగవత్పాదనిర్ణీతసిద్ధాన్తస్థాపనప్రభుః | వర్ణాశ్రమవ్యవస్థాతా నిగమాగమసారవిత్ || 4 || శ్రీమత్కర్ణాటరాజ్యశ్రీసంపత్సింహాసనప్రదః | శ్రీమద్బుక్కమహీపాలరాజ్యపట్టాభిషేకకృత్ || 5 || ఆచార్యకృతభాష్యాదిగ్రన్థవృత్తిప్రకల్పకః | సకలోపనిషద్భాష్యదీపికాదిప్రకాశకృత్ || 6 || సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞో మన్త్రశాస్త్రాబ్ధిమన్థరః | విద్వన్మణిశిరశ్శ్లాఘ్యబహుగ్రన్థవిధాయకః || 7 || సారస్వతసముద్ధర్తా సారాసారవిచక్షణః | శ్రౌతస్మార్తసదాచారసంస్థాపనధురన్ధరః […]