సరిహద్దులో నువ్వులేకుంటే ఏకనుపాప కంటినిండుగా నిదురపోదురా, నిదురపోదురా
నిలువెత్తునా నిప్పుకంచవై నువ్వుంటేనే జాతిబావుటా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా
ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా .. నీ తల్లే ఇండియా .. తన భరోసా నువ్వే దేశం కొడకా
సెలవే లేని సేవాకా ఓ సైనికా, పనిలో పరుగే తీరిక ఓ సైనికా
ప్రాణమంటే తేలికా ఓ సైనికా, పోరాటం నీకో వేడుక ఓ సైనికా
ఓ సైనికా… ఓ సైనికా… ఓ సైనికా…
దేహంతో విడిపోదే ఈకథ, దేశంలా మిగిలుంటుందిగా
సమరం ఒడిలో మీ మరణం సమయం తలిచే సంస్మరణం
చరితగా చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం
పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా పుస్తెలు లక్ష్య పెట్టావే ఓ సైనికా
గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనికా ప్రతి పూటా నీకో పుట్టుకే ఓ సైనికా
బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏపని తెలియదు అని నీ అడుగిటు పడలేదు
తెగువకు ధీరుడవని పరమగు భక్తుడవని ఏలేతి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి
ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా ..
ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా .. నీ తల్లే ఇండియా .. తన భరోసా నువ్వే దేశం కొడకా
నువ్వో మండే భాస్వరం ఓ సైనికా జ్వాలాగీతం నీ స్వరం ఓ సైనికా
బ్రతుకే వందేమాతరం ఓ సైనికా నీవల్లే ఉన్నాం అందరం ఓ సైనికా
ఓ సైనికా… ఓ సైనికా… ఓ సైనికా…