Ramulo Ramula Telugu lyrics

Pinterest
X
WhatsApp

బంటు గానికి ట్వెంటిటూ
బస్తిల మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు


కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెటూ
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు


సిల్కు చీర గట్టుకొని
చిల్డు బీరు మెరిసినట్టు
పొట్లంగట్టిన బిర్యానికి
బొట్టు బిల్ల వెట్టినట్టు


బంగ్ల మీద నిల్సొనుందిరో ఓ సందామావ
సుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావ
జింక లెక్కదుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో న దిల్లుకు మావ.

రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో(2 సార్లు)


రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో (2 సార్లు)


హెయ్! తమ్మలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తావే
ఎర్రగ పండిన బుగ్గలు రెండు
యాదీ కొస్తాయే


అరె పువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీనువ్వై పూస్తావే
పండుకున్న గుండెలొ దూరి
లొల్లే చెస్తావే

అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే


సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వులాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే….


నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పూడింటు
పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందామావ
పక్కకు పోయి తొంగిజూస్తఎ ఎం టెక్కురా మావ


రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో (4 సార్లు)

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!