ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగా ముందుకు వెళుతుంటే
అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే
ప్రేమంటారా … కాదంటారా
ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగా ముందుకు వెళుతుంటే
దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే
గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వెడుకుంటే
కష్టం కలిగిన ప్రతి పనిలో సాయం చేస్తుంటే
విజయం పొందిన వెలలలో వెను తట్టి మెచ్చుకుంటే
దాపరికాలే లేకంటే లోపాలను సరి చేస్తుంటే
ఆట పాట ఆనందం అన్నీ చెరిసగమవుతుంటే
ప్రేమంతరా … కాదంటారా
ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగా ముందుకు వెళుతుంటే
ఓ మనోహరి చెలి సఖీ
ఓ స్వయంవర దొర సఖ
మనసు నీదని మనవి సేయనా సఖి
బ్రతుకు నీదని ప్రతిన బూనన సఖ
నిను చూడలేక నిముషమైన నిలువజాలనే సఖి సఖీ
నీ చెలిమి లేని క్షణములోన జగతిని జీవింపజలనో సఖ
నటనకు జీవితం పోస్తుంటే
ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే
అటుపై సెలవని వెల్తుంటే
నీ మనసే కలవరపడుతుంటే
ప్రేమంటారా .. అవునంటాను
Leave your vote
0 Points
Upvote