నది మదిలో కడలిలా
మేఘాన నది మెదిలే
సరాగం స్వరాన్నే వినే చోటే
ఆశే అదుపుదాటే తనువు తూలిందే
ప్రేమంటే పేరాసే మెరిసే మినుకుల
హే, తెలియని తారా తీరం
జతపడే మాయాజాలం
పరవశం కమ్మిందేమో
ఈ నీలాకాశం
లలనా మధుర కలనా
హే హే, లలనా కనులు దాటే చినుకు వేగం
హే హే హే, లలనా ఉరికే యదలో
మౌనం మేఘం మొహం
తెలిపే తపమే వరుణం
తెలిపే తపమే తపనేదో రేపిందే
నెమలై మనసే హరివిల్లు తాకేలే
హరివిల్లే నా లలనా
హరివిల్లే జల్లిన పరువాల వాన పాడగా
ఓ, అలుపే మలుపై ఎదురై
ఆదమరించింది గమనాన
గెలుపే మెరుపై మెరిసేన గగనములై
సఖియే చెలియై వలచేనా
మనవే వినంగా
సడియె గడియలు మరిచేనా ముడిపడగా
నాదో నిషా రాగం… తానే ఉషా తీరం
వెలిగే ప్రపంచాలే తానై నన్నే విననీ
తానే ప్రపంచం అవ్వగా
ఎడబాటే ఓడే సుఖాంతం నన్ను తడపనీ
హే, తెలియని తారా తీరం
జతపడే మాయాజాలం
పరవశం కమ్మిందేమో
ఈ నీలాకాశం
లలనా మధుర కలనా
హే హే, లలనా కనులు దాటే చినుకు వేగం
హే హే హే, లలనా ఉరికే యదలో
మౌనం మేఘం మొహం
తెలిపే తపమే వరుణం
వేవేల సంద్రాలు మేఘాలల్లే
కరిగేది ఏ ప్రేమకోరి
ఇది ఆ నింగికీనేల రాసే కవితే
హే హే లలనా ఇలాచేరుకుంటే ఈ మేఘం
ఎద పాడుతుంది నీ గానం
ఎద పాడుతుంది నీ గానం.